పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0145-6 నాదరామక్రియ సంపుటం: 07-266

పల్లవి:
అందుకుంటే గెలిచితివౌనే నీవు
సందడినెప్పుడు నీవు చనవులిచ్చేవో

చ.1:
కూరిమి నీయెలుఁగులు కోవిలకూఁతలును
వోరలేకని చందాలొక్కటందురు
ఆరితేరి ఆరునెల్లకైనాఁ బలుకవని
పేరుకొన్నా నీవైతే బీరానఁ బలుకవు

చ.2:
కమ్మిన నీ కన్నులును కలువ పూవులును
నెమ్మదిని వొక్కతోడునీడలందురు
పమ్మి వికసించు మాపటికవి నీవైతే
వుమ్మడి నే వొద్దనుంటే వొక్కింతాఁ జూడవు

చ.3:
అంది నీ చేతులుఁ దీగెలవి వొక్కసరందురు
కందువనరడునవి కౌఁగలించవు
చెంది కూడితివింతలో శ్రీ వేంకటేశుఁడనని
ముందునేనంటితేఁ గాని మొనగోరు మోపవు