పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0145-55 సౌరాష్ట్రం సంపుటం: 07-265

పల్లవి:
బలు నీ నేమము చూచి ప్రత్యక్షమయితి నీకు
అలమి నాకౌఁగిటనే అనుభవించవయ్యా

చ.1:
కొమ్మచన్నులకౌఁగిలి కొండలమీఁది తపసు
సమ్మతిమాటలే మంత్రజపములు
పన్నిన నిట్టూర్చులే ప్రాణాయామములు
నెమ్మది మాకూటములె నిండుయోగాలు

చ.2:
సారె సారె వీడేలు శాఖాహారములు
సారమైన సిగ్గులు పైపై సన్యాసాలు
ఆరయఁ బరవశాలు అందిన బ్రహ్మానందాలు
తీరనితనుభోగాలు దేవపూజలు

చ.3:
బొడ్డు హోమపుగుంటలు పాంగుఁజెమటలు నేయి
అడ్డములేని సరసాలాచారాలు
వెడ్డువెట్టి కూడితి శ్రీవేంకటేశ నన్నునిట్టే
వొడ్డిన తమకములే వున్నతపదవులు