పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0145-4 దేశి. సంపుటం: 07-264

పల్లవి:
ఏల మమ్ముఁ దడవేవు యింకానయ్య
యేలితివి నాఁడెనాఁడె యెరుఁగుదుమయ్యా

చ.1:
చిత్తములో చింతలెక్కి చిగురులు గోసేవారు
అత్తి నిన్ను వెదకేరు అదిగోవయ్య
వౌత్తిలి నవ్వులు నవ్వి వొడుళ్ళు నించేవారు
బత్తులు సేసేరు నీకుఁ బైకొనవయ్యా

చ.2:
మించులమాటల మంద మిరియాలు చల్లేవారు
అంచుల నిన్నుఁబిలిచేరాలకించవయ్య
పొంచి నీతో జాళెలేక బొమ్మరాలు వేసేవారు
ముంచి చేతులు చాఁచేరు మొగిఁజాడవయ్యా

చ.3:
తోడనెసరెత్తి లేళ్ళఁ దోలేటియట్టివారు
యీడనే విందులు చెప్పేరియ్యకోవయ్య
కూడితి శ్రీవెంకటేశ గొబ్బున నిదె నేఁడు
వాడికెగా కొంతగొంత వారిమెచ్చవయ్యా