పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0145-2 శుద్దవసంతం సంపుటం: 07-262

పల్లవి:
పోపో నీకిదియేమి పొద్దువోదు
తీపులు చూపి మమ్ముఁ దియ్యకురా యిఁకను

చ.1:
ఒల్లనివాఁడవు మమ్మునూరకేల పిలిచేవు
మల్లాడి మాపైమనసు మరవరాదా
బల్లిదురాలాకెగొన్న బాసదప్పినాఁ దప్పీ
పల్లదాననిఁక నీవు పట్టకురా మమ్మును

చ.2:
ఇంటికి రానివాఁడవు యేడనైన నవ్వనేల
వెంటనే మాతో తగులు విడువరాదా
గొంటరై యిందుకునాపె కోపగించినా కోపించీ
అంటి ముట్టి సరసములాడకురా యిఁకను

చ.3:
పంతపువాఁడవు మమ్ము పట్టి కౌఁగిలించనేల
అంతయు నాపెనే పోయి అడుగరాదా
చెంతనే శ్రీవెంకటేశ చేకొని నన్నుఁగూడితి
వింతకంటె రతినలయించకురా నీవు