పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0145-1 బౌళి సంపుటం: 07-261

పల్లవి:
ఇందరూను జూడఁగానే యింతసేతురా
చెంధమ్మిరేకుల కొన చేపలాయ నేఁడు

చ.1:
చేరి సిగ్గువడఁగానె చెయిపట్టి తీసేవు
సారెకును మగవానిజాడగా యిది
తేరకొన మెత్తనైతే దిగఁబడేదన్నమాఁట
యేరా నీవల్లఁగంటిమిదివో నేఁడు

చ.2:
గద్దించి జంకించఁగానె కళలంటఁ జూచేవు
వొద్దనున్న రమణుని వోజగా యిది
అద్దుకొని మాఁటలలోనంటు బచ్చలన్నమాట
తిద్ది నీవద్దనున్నది తేరకొన నేఁడు

చ.3:
పయ్యద దొలఁగఁగానె పట్టేవు కుచములు
నెయ్యపు విటునికెల్ల నేర్చుగా యిది
గయ్యాళిరతిఁ గన్నదే కందికుడుమన్నమాట
నియ్యందే శ్రీవేంకటేశ నిజమాయ నేఁడు