పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0144-6 శంకరాభరణం సంపుటం: 07-260

పల్లవి:
నీవాడినదే మాట నేఁజేసినదే చేఁత
యీవిధాన మనలోన యెరవులు గలవా

చ.1:
చిత్తమెల్ల నీసోమ్ము సిగ్గులివి నాసామ్ము
మత్తిలి పూవుటమ్ములు మరునిసామ్ము
కొత్తగా నీవు నేను కుష్పలుసేసుకొంటిమి
యిత్తల నీకును నాకు హెచ్చుకుందులున్నవా

చ.2:
మొక్కులెల్ల నీపాలు మోవినవ్వు నాపాలు
చిక్కి యెడమాటలు చెలులపాలు
తొక్క మెట్టుగాను మనము దొరయఁ బంచుకొంటిమి
కక్కసించి చూచితేను కడమలిందున్నవా

చ.3:
వినయాలు నీచేతివి వేగిరాలు నాచేతివి
అనువైన యాసలు పాయముచేతివి
ఘనుఁడ శ్రీవెంకటేశ కలిసితిమింతలోనె
చనవుల రతులలో జంపులు మరున్నవా