పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0144-5 కాంబోది సంపుటం: 07-259

పల్లవి:
ఏమిగాఁ జూచితివి నన్నెంతసేసేవయ్య నీవు
కామించి రతులలోనే కనేవు నాజాడలు

చ.1:
చిన్నారి పొన్నారినాటి చీరలలో సిగ్గులా
కన్నెనైన నామంచి కను చూపులు
వెన్నలు దొంగిలేనాటి వెఱిగొల్లెతలలో నీ
సన్నల నాతోడి నీసరసాలు

చ.2:
పసులఁ గాచేనాటి బాఁపెతల విందులా
ముసరే తుమ్మెద నామోవితీపులు
సిసువవై యెమునలోని చీఁకటి నీ తప్పులా
యెసఁగిన నాతోడి యియ్యకోలుఁ జాఁతలు

చ.3:
బలిమి రుక్మిణిఁదెచ్చి పైకొన్న నీకూటమా
చెలరేఁగినట్టి నాసేసపెండ్లి
యెలమి శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
అల పదారువేలతో అంకెలా నాలంకెబు