పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0144-3 సామంతం సంపుటం: 07-257

పల్లవి:
ఆఁటదానిబలువిది ఆడుకోనేమున్నది
కూటములు గలిగితే కొంగువట్టి తీసును

చ.1:
కూరిమిగలుగు సతి కోపగించుకొంటేను
పేరడి కన్నీరు నించు ప్రియుని తోను
ఆరీతి నాఱడికత్తెయైతే మఱియొకతె
నేరుపుతోడ నూరకే నెటికవిరుచు

చ.2:
యేఁపిన విభుఁడువచ్చి యెదుట నిలిచితేను
దాపుగఁజేయెత్తిమొక్కి తలవంచును
రావుతోడ వేరొకతె రాజసమైనది యైతే
తీపుల మోవి మీఁద తిట్టులెల్లాఁదిట్టును

చ.3:
ఆసపడ్డ మగువను ఆయములంటితేను
నేసవెట్టి లోనౌను సిగ్గుతోడను
యీసుదిర శ్రీవేంకటేశ ననుఁబోఁటిదైతే
వాసికి నిన్నుఁగూడి వలపెల్లా నింతును