పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0144-11 శ్రీరాగం సంపుటం; 07-255

పల్లవి:
బాపు బాపు నాతపసు ఫలియించెను
యేపున నీచెప్పినట్టే యిఁకనుండే నేసు

చ.1:
మచ్చరము నాకుఁదీరె మనసెల్ల నొక్కటాయ
నచ్చులనాపె నీతో నవ్వఁగాను
విచ్చనవిడిఁజలఁగు వెంగెమాడ నిన్నుమఱి
యిచ్చకురాలనై నీకు యిఁకనుండే నేను

చ.2:
వేడుకలు నాకుఁబుట్టె వెరపులిన్నియుఁ బాసె
కూడా నీతొడపైనాపె కూచుండఁగాను
వోడక సిగ్గువిడువు వుల్లసాలాడ నిన్ను
యీడనె సతమై నీకు యిఁకనుండే నేను

చ.3:
తారుకాణ నాకువచ్చె దయపుట్టె నాలోన
చేరి కౌఁగిలించి యాపె చెనకఁగాను
యీరీతి శ్రీవేంకటేశ యిటునన్నుఁ గూడితివి
యీరసము మానెఁ బాయకిఁకనుండే నేను