పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0143-6 కన్నడగౌళ సంపుటం: 07-254

పల్లవి:
నీకెరవుగాను నేను నీవునాపెఁ గూడితేను
రేకగా నీళ్ళడచితే రెండయ్యీనా యెపుడు

చ.1:
నేరుపున నాపెతోడ నీవే మాటాడరాదా
చేరి నేఁబిలువఁబోతే సిగ్గువడీని
సారెఁ బ్రియముచెప్పినా సవతుల నమ్ముదురా
పేరనిపాలఁ దోడంటుపెట్టితేను పేరునా

చ.2:
పంతాన నీవేకతాన బలిమిసేయఁగరాదా
చెంతలనేఁ జేవట్టితే సిగ్గువడీని
యింతటి మావంటివారి యిచ్చకాలియ్యకొందురా
కొంతైనా నినుముతోఁ గూడునా కనకము

చ.3:
వల్లెవేసి యాపెఁగూడి వావులు చెప్పుకోరాదా
చెల్లెలవంటేఁ దాను సిగ్గువడీని
యిల్లిదె శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
వొళ్ళఁబెట్టిన సొమ్ములు వొద్దికెఁగూడుండవా