పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0143-5 కేదారగౌళ సంపుటం: 07-253

పల్లవి:
నిక్కము నాబదుకెల్ల నీచేతిది
మక్కువలు నెరవేరె మఱి యేఁటిమాటలు

చ.1:
తలఁపు నాలోనిది తగవు నీచేతిది
వలపు పదారేండ్లవయసుది
నిలువెల్లఁ జెమరించె నీవొ ద్దనుందాన
చెలులింకనేమని చెప్పేరు బుద్దులు

చ.2:
సిగ్గులు నామేనివి చెనకు నీగోళ్ళది
తగ్గనియాసలు మనతమకమువి
వెగ్గళించెఁ బులకలు వేడుకలు గనమాయ
కగ్గుదేర నేమని కానుకలిచ్చేను

చ.3:
చన్నులు నావురమువి చనవు నీకౌఁగిటిది
పన్నిన పరవశాలు భావరతివి
అన్నిటా శ్రీవెంకటేశ అట్టె నన్నుఁగూడితివి
యెన్నిలేవు నీగుణాలు యెదురెద్‌ నీకు