పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0143-4 మాళవిగౌళ సంపుటం: 07-252

పల్లవి:
ఎవ్వరినేల తడవేవీడ వారేమిసేతురు
జవ్వనపాయముమీఁద సడివేయవే

చ.1:
మందలించి మాతోనేల మాటలకు వచ్చేవు
కందువలు పతినడుగవే నీవు
అంది వుండఁబట్టకుంటే ఆతని నిన్నుఁగూర్చిన
ముందరి మరునికే మొరవెట్టవే

చ.2:
యిల్లురికి మాతోనేల యీసడించ వచ్చేవు
చెల్లుబడాతనిమీదఁ జేయవెే నీవు
పల్లదమంత గలిగితే పై పై నెడమాటలాడే
తెల్లమైన నీచెలులఁ దిట్టవే నీవు

చ.3:
సంగడిఁ గూచుండి నీవు సణంగులేల రాలేవు
బంగించి యీతనిఁ దప్పుపట్టవే నీవు
రంగ్రై శ్రీ వేంకటేశుఁడు రమించె నీతఁడు నాతో
అంగడి జాణతనములాడవే నీవు