పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0143-3 దేశి. సంపుటం: 07-251

పల్లవి:
మేలయ్య నీచేఁతలు మెచ్చితినయ్య
తాలిమిలెస్సపనాయఁ దగవరివవుదువు

చ.1:
పడఁతిఁ బిలువనంపి పగడసాలాడేవు
వుడుగకీపరాకులకోపునా ఆపె
యెడసి పానుపుమీఁద యెదురుచూచీఁ జెలియ
నడుమ మామోముచూచి నవ్వేవిక్కడను

చ.2:
కొమ్మను లోనికినంపి కొలువున్నాఁడవు యీడ
వుమ్మగిలు నికాఁకలకోపునా ఆపె
చెమ్మఁ జెమటలతోడ చేసన్న సేసేనబల
పమ్మి మాకునుడిబడి పనులుచెప్పేవు

చ.3:
దోమతెర వేయించి తొంగిచూచేవిందరిని
వోముచు నీవేసాలకోపునా ఆపె
ఆముకొని శ్రీవేంకటాధిప నిన్నింతి గూడె
వేమారు మమ్మిక్కడను వీడేలడిగేవు