పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0143-2 దేసాళం సంపుటం: 07-250

పల్లవి:
ఇద్దరము నిద్దరమే వొవొయి
వద్దుసుమ్మీ వట్టిపంతాలోవోయి

చ.1:
యెఱఁగవా మాగుట్లు యేమోయి మమ్ము
ఉఱక గుట్టరసేవు వొవోయి
యెఱికెతనా నీకు యేమోయి - మాపై
వొఱగుంటే నేమాయనో వోవోయి

చ.2:
యెప్పటికెప్పటి సుద్దులేమోయి - నీపై
నుప్పరాలెగసీఁ జన్నులేమోయి
యిప్పలేర్లులాయ మోవి యేమోయి
వొప్పన గొనుమీ నేఁడు వోవోయి

చ.3:
యెమ్మెల్లు మనలోనేల యేమోయి
వుమ్మగిలీ వలపులు వోవోయి
యిమ్ముల శ్రీవేంకటేశ యింతలోనె కూడితిమి
వొమ్మెగా జాణతనాలోవోయి