పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0143-11 సౌరాష్ట్రం సంపుటం: 07-249

పల్లవి:
పొత్తుల మగువలకుఁ బోవునా యింక
యిత్తలఁ గూడుండుదము యీడకిట్టేరావే

చ.1:
మచ్చరము నాకేలే మగఁడు మొదలనే
మచ్చికచేసి నిన్ను మన్నించునట
వెచ్చనూర్పు నీకలే వెరపులింకానేలే
కుచ్చినేనూఁ గౌఁగిలించుకొనేఁ గాని రావే

చ.2:
వెంగెమాడ నాకేలే విభుఁడు వేడుకపడి
సింగారించి నిన్ను రట్టుసేసుఁ దానట
ముంగిటనే కొంకనేలె ముసీముసీ నవ్వులేలే
సంగడిబూవానకు చలివాపీ రావే

చ.3:
పెనఁగఁగ నాకేలే ప్రియుడు లోలోనె వచ్చి
కనుసన్న సేసి నిన్నుఁ గలపునట
నను శ్రీవేంకటేశుఁడు నవ్వుతానిట్టెకూడె
తనిసిన రతులు చింతనసేసే రావే