పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0142-6 భైరవి సంపుటం: 07-248

పల్లవి:
ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు
మారుకోకు మగవాని మనసు మెత్తనిది

చ.1:
చలము సాదించవద్లు చనవే మెఱయవే
చెలువుఁడాతఁడే నీచేతఁ జిక్కీని
బలుములు చూపవద్దు పకపక నగవే
అలరిన జాణతనమందులోనే వున్నది

చ.2:
పగలు చాటఁగవద్దు పైకొని మెలఁగవె
సాగిసి ఆతఁడే నీసామ్మై వుండీని
తగవులఁబెట్టవద్దు తమకము చూపవే
అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి

చ.3:
మొక్కలమేమియునొద్దు మోహములు చల్లవే
నిక్కి శ్రీవేంకటేశుఁడు నిన్నుఁగూడెను
తక్కులఁ బెట్టఁగవొద్దు దయలు దలఁచవే
అక్కజపు నీరతులు అందులోనే వున్నవి