పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0142-4 శ్రీరాగం సంపుటం: 07-246

పల్లవి:
తానిటువంటివాఁడా తనగుణమిదిగాదు
వూని యీ వెరపు మతిఁబుట్టించినదెవ్వతె

చ.1:
కొత్తకొత్తవలపులు కొంతకొంత నెరపుతా
వత్తునంటాఁ జెప్పెంపవలెనా నేఁడు
యిత్తలఁ దా వింతవాఁడా యెవ్వరన్నా వద్దనేరా
చిత్తములోనింత కొంకఁజేసినది యెవ్వతె

చ.2:
వేఁడివేఁడి తమకము వేసివేసితనచేయి
వాఁడి నాచన్నులమోపవలెనా నేఁడు
పేఁడుకొనేవమా చలము భేదమా తనకు నాకు
పోఁడిమి తనకునింత బుద్దిచ్చినదెవ్వతె

చ.3:
ముద్దుముద్దుమాటల ముంచి ముంచి బాసలిచ్చి
వద్దనుండి గొరగీరవలెనా నేఁడు
అద్దుక శ్రీవేంకటేశుఁడన్నిటాఁదా నన్నుఁగూడె
తిద్దినట్టి తనపాలిదేవరైనదెవ్వతె