పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0142-3 పాడి. సంపుటం; 07-245

పల్లవి:
ఏల నన్నునొరసేవు యిన్నేసిచేఁతలను
చాలుననేనా మోవి చప్పఁజేతుఁగాక

చ.1:
పంతములాడేనా పరాకున నీవుండితే
చింతదేర నీసేవ సేసీఁ గాక
వంతులడిగేనా నిన్ను వనితలలోన నుంటే
దొంతరవలపులను తొప్పఁదోఁగింతుఁ గాక

చ.2:
కన్నులఁ దిట్టేనా గక్కన నీవు రాకుంటే
చన్నులనే వొత్తి నిన్ను సాదింతుఁగాక
విన్నపాలు సేసేనా విచ్చనవిడినే వుంటే
కిన్నర మీఁట్లలోనే గిలిగింతుఁగాక

చ.3:
కపటాలు సేసేనా కాఁగలించుకోకుండితే
వుపమ వీడేనకుఁ జేయొగ్గింతుఁ గాక
యిపుడె శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
అపలాపించేనా నేనట్టే మెత్తుఁగాక