పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0142-2 శ్రీరాగం సంపుటం; 07-244

పల్లవి:
ఇందవయ్య కానుకయిచ్చె నీకుఁజెలియ
మందలించేనింటికాడ మగవలో నిన్నును

చ.1:
కలువరేకులవాఁడి కాంతచూపులనున్నది
వలరాజు నమ్ములకు వాసనే కాని
చలివేఁడి వలపులు చన్వుణకొనల నవే
చెలువుఁడ నీవిఁకనేల సేసేవు జాగులు

చ.2:
ననిచిన చిగురెల్లా నాఁతిమోవినె వున్నది
వనముల మాకులెల్లా వట్టివే కాని
మనసుమర్మములెల్లా మాటలతుదలఁదోఁచె
ఘనుఁడవు యిఁకనేల కప్పేవు తమకము

చ.3:
నిండుమేఘము మెరుఁగు నెలఁతమోమున నిదే
వుండు మింటననే పేరు వొక్కటేకాని
కొండల శ్రీవేంకటేశ కూడితిరిద్దరు నేఁడు
గండికాఁడ యిఁకనేల కాదనేఫు మాటలు