పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0141-6 గౌళ సంపుటం: 07-242

పల్లవి:
తరుణిమేనికిని నీతనువె మాటు
నిరతవుటాసకు నిండుఁజూపె మాటు

చ.1:
చెలియసిగ్గులకు చెక్కుచేయే మాటు
పలుకులకును మోవిపండె మాటు
నెలకొన్న చింతలకు నివ్వెరగే మాటు
బలుజవ్వనమునకు పయ్యదే మాటు

చ.2:
ముంచిన నవ్వులకును మొక్కులివే మాటు
మంచి నడపులకును మట్టెలే మాటు
వంచిన శిరసునకు వాలుఁగొప్పే మాటు
కొంచని చనులకు కొనగోరె మాటు

చ.3:
పొందుల రతులకను పుక్కిటివిడెమె మాటు
అందిన వేడుకకు నాయములె మాటు
విందుల వలపులకు వేవేలు రతులె మాటు
యిందుముఖికై శ్రీవేంకటేశ నీ యింపె మాటు