పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0141-3 బౌళి సంపుటం: 07-239

పల్లవి:
ఔనే జాణక త్తెవు అన్నిటా నీవు
యేనిగె గుజ్జౌఁగదే యెక్కినవారికిని

చ.1:
ఇంతవాసి గలదానవేల నవ్వితివే ముందు
చెంతఁ బెట్టనికోటవై చెలఁగవద్దా
వంతులకు నీవెంత వలపించుకొనినాను
పంతపు విభుఁడు కిందుపడునా నీకు

చ.2:
యెగ్గుపట్టేటి దానవు యేల రమ్మంటివే ముందు
వొగ్గి వీడనిగంటవై యుండఁగరాదా
అగ్గలమై నీవెంత అట్టి బాసగొనినాను
సిగ్గులాతఁడు ప్రియము చెప్పునా నీకు

చ.3:
యెలయించేటిదానవు యేల మొక్కితివే ముందు
అల కదలనికంబమై యుండరాదా
బలిమి శ్రీ వెంకటేశుఁగలసి యెంతవుండిన
బలువుఁడీతఁడు తడఁబడునా నీకు