పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0141-2 సౌరాష్ట్రం సంపుటం: 07-238

పల్లవి:
ఎట్టు దరియించవచ్చును యిటువంటివెల్లఁ జూచి
బట్టబయలీఁదించఁగా భ్రమసినట్టయ్యీని

చ.1:
పమ్మి నీమేనిమీఁదట పచ్చిచెమట గారఁగా
నమ్మికలియ్యఁగనే పో నవ్వు వచ్చీని
చిమ్ముచు వెంగెమాడితే సిగ్గులువడక నీవు
నెమ్మదినూఁకొనఁగానే నివ్వైరగయ్యీని

చ.2:
పోదిగా నీపెదవికెంపులు రేఁగ మాటలాడి
ఆదరించఁగానె పో అదరీ మేను
ఆదెస నేరమెంచితే అందాలు సేసుక నీవు
వాదుకు రాకుండఁగా నివ్వల సోద్యమయ్యీని

చ.3:
మేరతో ఆఁడుసామ్ములు నీమెడఁ బెట్టుకొని వచ్చి
సారెఁ గాఁగలించఁగా బో చలమెక్కీని
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి ననునిట్టే
గారవించఁగా నప్పటిఁ గరుణ వుట్టీని