పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0140-4 ముఖారి సంపుటం: 07-234

పల్లవి:
వింతవాఁడా తానేమి వేమరుఁ జెప్పీంచుకొన
బంతినే తరితీపులు పచరించవలెనా

చ.1:
తనమాటే నామాట దగ్గరి రమ్మనవే
యెనసియునెడమాటలేలాడించీని
మనసుకు మనసే మరి తారుకాణగదే
చెనకి పొందులు యింకాఁ జేసి చూపవలెనా

చ.2:
అక్కడే యిక్కడ నాఅండనుండుమనవే
పెక్కుప్రియములెల్లాఁ జెప్పించఁగనేల
చొక్కమైన చూపుకు చూపులే గురిగదే
పక్కన నింకా నొడఁబరచఁగవలెనా

చ.3:
యీవలఁ దానే నేను యిప్పుడె కూడుమనవే
శ్రీ వేంకటేశుఁడేల సిగ్గువడీని
వావులకు వావులే వలపించెఁగదవే
వేవేలుగా మన్నించె వేఁడుకొనవలెనా