పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0140-3 కాంబోది సంపుటం: 07-233

పల్లవి:
ఎంతసంతోసమోకాని యేమి చెప్పేది
వింతలైన వలపుల విడిదాయఁ దాను

చ.1:
అమరనాదరించి చెప్పంపిన నీమాటవిని
చెమటలచెలమాయఁ జెలియ
గమకపు నీముద్దుటుంగరపు గురుతుచూచి
గములైన మెఱుఁగులగని యాయ మొగము

చ.2:
అలరనాసరేఁచ నీవంపిన విడెము చూచి
పులకలపోగాయఁ బొలఁతి
వలనై పొందికల నీవ్రాలకమ్మలు చూచి
పలచని నవ్వుల పండుగాయ మోవి

చ.3:
కడఁగి శ్రీవేంకటేశ కాఁగిట నీవు నించితే
కడు సిగ్గులకొండాయఁ గలికి
వుడివోని నీరతుల వొడఁబడికలఁ జెంది
అడియాలమైన మణిహారయమాయను