పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0140-11 శ్రీరాగం సంపుటం; 07-231

పల్లవి:
గుట్టుగలవాఁడు గల కొసరఁడాతఁడు నిన్ను
రట్టడితనమున నాఱడిసేయకువే

చ.1:
యెండమావుల నీరు యేకతపు పాలయలుక
వండఁగ వండఁగ నట్లు వలపులెల్ల
కొండల నున్ననిచూపు గొనకొన్న వెడయాస
అండనుండే విభుని నలయించనేలే

చ.2:
గుంటిమీఁదటివాన కొనబు సరసపుటాన
వెంటవెంట తోడినీడ వేడ్కతగులు
పంటవండిన పొల్లు పాసివుండినకాఁక
జంటఆయిన పతినింత సడిఁబెట్టునేలే

చ.3:
బేగడపసిఁడి నిగ్గు బీరపుబిగువులివి
లాగవేగపుగోరి లాంచనములు (?)
చేగదేరఁగఁ గూడె శ్రీ వేంకటేశ్వరుఁడు
యీగతి నితనినింక యెలయించనేలే