పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-6 శంకరాభరణం సంపుటం: 07-230

పల్లవి:
ఏఁటిమాఁటలాడేవే యెందాఁకా నీవు వోరి
వాఁటముగ యిట్టే వట్టి వళకులాడకురా

చ.1:
పయ్యదలో వాలెనవే పట్టియ్యవే జక్కవల
కొయ్యకాఁడ కావుర కుచములివి
ముయ్యనేఁటికే అట్లెతే మొరఁగక చూపఁగదే
యియ్యెడఁ బైఁడి బెందెలెట్లు చూపవచ్చురా

చ.2:
వొడిలోన దాఁగెనదే వొప్పగించవే సింహము
గడుసుకాఁడ కాదది నడుమింతేరా
విడిచి సోదనీవే విచ్చనవిడినట్టెతే
సుడిసి ఆకసమెట్లు సోదనగొనేవురా

చ.3:
కుచ్చలలోపల దాఁగె కొమ్మ నెమళ్ళ నీవే
అచ్చపు నడపులింతే అవిగావ్లురా
కుచ్చి శ్రీ వేంకటేశుఁడ గురితేది అట్టెతే
యిచ్చఁగూడితివి గురుతెటు చూపవచ్చురా