పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-5 బౌళిరామక్రియ సంపుటం: 07-229

పల్లవి:
నాకే వలతువోయి నరహరి
చేకొని నేనెరుఁగుదు చెప్పకు నరహరి

చ.1:
నగేవు నామోము చూచి నరహరి నీ
నగరెల్లా సతులే నరహరి
నగములు మాచన్నులు నరహరి
పగటున నిన్ను నాఁటీఁ బట్టకు నరహరి

చ.2:
నలుగడఁ జూచి చూచి నరహరి మోవి
నలినలిసేతురా నరహరి
నలఁగనియ్యకు కొంగు నరహరి
బలిమినెవ్వరెవ్వరు పట్టిరో నరహరి

చ.3:
నానారతులఁ గూడి నరహరి కడు
నానఁబెట్టేవు వలపులు నరహరి
మానక శ్రి వేంకటేశ మండెమురాయఁడవై
పూని నన్ను మన్నించి పొందేవు నరహరి