పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-4 హిందోళం సంపుటం: 07-228

పల్లవి:
నేరములెంచేదెల్లా నిన్నా నేను
నేరిచి మాటాడేది నీతోనా నేను

చ.1:
కపటాలు గలవంటా కల్లరివి నీవంటా
నెపములెన్నేదల్లా నిన్నా నేను
వుపమల దాననంటా వొరపులు నేర్తునంటా
నిపుణత మెరసీది నీతోనా నేను

చ.2:
యెక్కడనో వుంటివంటా యెరవులవాఁడవంటా
నిక్కపుబాసడిగేది నిన్నానేను
చక్కనిదాననంటా చలము సాదింతునంటా
నెక్కొని నవ్వునవ్వేద్‌ నీతోనా నేను

చ.3:
మట్టున నడవుమంటా మాయింటికి రమ్మంటా
నెట్టనఁ గొంగువట్టేది నిన్నానేను
గట్టిగ శ్రీ వేంకటేశ కలసితివిటు నన్ను
నిట్టూర్పుతో నలసినది నీతోనా నేను