పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-3 పాడి సంపుటం; 07-227

పల్లవి:
ఆనక పోరాదుగాని అండనుండ వారము
నిను నీవెరఁగలేవు నీకేడ వలపు

చ.1:
ఆఁటదానిఁ గంటే పతి ఆదరించనే వలె
వేఁటకానివలెనుంటే వేడుకేడది
గాఁటానఁ గొలువుసేయఁగా గద్దెమీఁదనుండి
నీటుతోనే సాదించేవు నీకేడ వలపు

చ.2:
పాసివున్న సతిఁగంటే బాఁతిపడి నవ్వవలె
మాసటీనివలెనుంటే మచ్చికేడది
ఆసపడి చూడఁగాను అట్టి మలఁగుపైఁబండి
నీ సుద్దులే చెప్పేవు నీకేడ వలపు

చ.3:
తరుణి కూటమి గంటే దప్పిదేర్చనేవలె
తరకానివలెనుంటే తమియాడది
అరిది శ్రీ వేంకటేశ ఆపె నిన్నుఁ గూడఁగాను
నెరుపేవు సిగ్గులే నీకేడ వలపు