పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0139-11 గుజ్జరి సంపుటం: 07-225

పల్లవి:
ఏఁటికి మంకుఁదనము యీవేళను
గాఁటాన నొాడఁబరచీఁ గానిమ్మనఁ గదవే

చ.1:
చలము సాదించఁబోతే చప్పనౌను బ్రియము
బలిమిసేయఁగఁబోతే పలచనౌను
పిలువఁగ రాకున్న బెట్టుగా వేసటవుట్టు
చెలఁగి నీ రమణుఁడు చెప్పినట్టు సేయవెే

చ.2:
యెదురు మాటాడితే యెగసక్యమౌ పొందు
పదరితే కడుఁగడుఁ బాటి చాలదు
పాదుగఁగ నూరకున్న పోరచి కాఁకలు రేఁగు
అదన నీపతిమతి ఆస యీడేరించవే

చ.3:
చేవల్లకు రాకుండితేఁ జిగిరించు పంతము
భావించక లోఁచితేను పచ్చిదేరును
యీవేళఁ గూడె నిన్నునింటికిఁ దానే వచ్చి
శ్రీ వేంకటేశ్వరుఁడు చెనకీని నవ్వవే