పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0137-5 శ్రీరాగం సంపుటం; 07-221

పల్లవి:
రమణి నూరడింతువు రావయ్య నీవు
తమకించి తన్నుఁదానె తల్లడించీ నిదివో

చ.1:
అప్పుడు నిన్ను సాలసి యాడి యాలాడితినంటా
దప్పీదేరే మోవితోడఁ దలఁకించీఁ జెలి
కొప్పువట్టి తియ్యఁగాను గోరు నిన్నుఁ దాఁకెనంటా
అప్పటి లోలోనె వుస్సురనీ నిదివో

చ.2:
వెంగేన నిమ్మపంటను వేసేలవేసితినంటా
కంగి మనికితపడి కరఁగీఁ జెలి
ముంగిటఁ బెనఁగఁగాను యెంగిలి మోవంటె నంటె
పాంగుఁ జెమటలతోఁ దాఁ బొగిలీనిదివో

చ.3:
వుబ్బునఁ జనుమొనల నొత్తేల వొత్తితినంటా
అబ్బురానఁ జిన్నఁబోయి అలసీఁ జెలి
గబ్బి శ్రీ వేంకటేశుఁడ కాఁగిట నిన్నటుగూడి
గుబ్బలొత్తెనంటా నీకుఁ గొంకి మొక్కీనిదివో