పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0137-3 ముఖారి సంపుటం: 07-219

పల్లవి:
అంతటఁ దనవుడుకారును అయినట్టయ్యీఁ బంతము
చెంతల నావిన్నపమిది చేకొనుమనఁగదవే

చ.1:
పాందులుసేసేదెల్లా పోరాటముకొరకేనా
యిందుకునేమీనసఁ దను నింటికి రమ్మనవే
కొందరు సతులను జూపుచు కోపము రేఁచఁగనప్పుడు
ముందుగనేమని యంటినొ మొక్కితి నేననవే

చ.2:
యెనయుచు నవ్వినదెల్లా యెగ్గులు పట్టుటకేనా
వెనకటివిఁకఁ దడపేనా వీడెము గొమ్మనవే
వనితలయిండ్ల వాకిట వడిఁ దా రచ్చలుసేయఁగ
మొనగోరటు సోిఁకించితి మొక్కితి నెననవే

చ.3:
సొలసిన కౌఁగిటి రతులివి సూడులు వట్టుటకేనా
అలమేల్మంగను నేనే అలను తనకనవే
యెలమిని శ్రీ వేంకటేశుఁడుయెవ్వతె సుద్దులొ తలచఁగ
మొలనూలునఁ దనువేసితి మొక్కితి నేననవే