పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0137-1 రామక్రియ సంపుటం: 07-217

పల్లవి:
నీవెరఁగవటవయ్యా నెలఁతకు గర్వమని
ఆవల నీ వలనట్టే ఆడేవు గాక

చ.1:
ఆఁటదానికిని సిగ్గే అంతటా నిండినసామ్ము
నాఁటుకోఁజూచే చూపే నమ్మినసామ్ము
మేఁటి మురిపెములే మిక్కిలి దాఁచినసామ్ము
వాఁటపు సెలవినవ్వే వన్నెలసామ్ము

చ.2:
కాంతకును గుట్టు తోడి గంభీరమే సొమ్ము
యెంతైనాఁ బదరకుండుటెక్కువసామ్ము
పంతపు మాటలాడుటె భావము నిండిన సొమ్ము
మంతుకెక్కే సణంగులు మాయని సొమ్ము

చ.3:
తరుణికిఁ బతితోడి తరితీపులే సొమ్ము
బిరుదురతులె చాలాఁ బెట్టిన సొమ్ము
నిరతి శ్రీ వేంకటేశ నీతోఁ బెనఁగుటే సామ్ము
సరుస మంచముపై రాజసమే సొమ్ము