పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0136-5 కేదారగౌళ సంపుటం: 07-215

పల్లవి:
తానె తలఁచుకొని తగిలి మన్నించీఁ గాని
మోనముతో మోము చూపి మొత్తమున రావే

చ.1:
మున్నిటి తన మాటలు ముదులకించి రావే
అన్నిటా తన సన్నలు అడిగి రావే
చన్నులు నేలమోవ సాగిలి మొక్కి రావే
వున్నతిని చేకానికె వొద్దఁబెట్టి రావే

చ.2:
అప్పుడు నేఁగన్నకల ఆతనితోఁ జెప్పి రావే
వొప్పుగాను మనసంతయు నొరసి రావే
విప్పుచుఁ బెదవులను వినయము చూపి రావే
అప్పటి గోడ గురుతు నటు వ్రాసి రావే

చ.3:
సంగడి నుండిన వారి సాకిరివెట్టి రావే
కంగులేక తనబుద్ధి కైకొని రావే
చెంగటికి తానే వచ్చి శ్రీవేంకటేశుఁడు గూడె
సంగతాయననిమెచ్చి సరసకు రావే