పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0136-4 పాడి సంపుటం: 07-214

పల్లవి:
నీ వలె నింత గర్వించనేరనే నేను
యీవలనావలఁ దానే యిందుకేమిసేసేవే

చ.1:
ఉద్దండాన నిన్నాతఁడు వొడివట్టి తీసినంటా
పెద్దరిక మెందాఁకఁ జెప్పీవే నీవు
వొద్దికతో నాక్టైతే వుంగర మిచ్చినాఁడు
యిద్దరము నిద్దరమే యిందుకేమి సేసేవే

చ.2:
జక్కవ కుచాలమీఁద చందురుల నించెనంటా
చొక్కుచుఁ జెలులకేల చూపేవే నీవు
అక్కరతో నాకైతే అచ్చువేసి యేలినాఁడు
యెక్కుడు మన పంతాలు యిందుకేమి సేసేవే

చ.3:
కప్పి నిన్నునింతలోనే కౌఁగలించుకొనెనంటా
చిప్పిలుఁ జెమటలనేల చిమ్మిరేఁగేవే
వొప్పుగ యీ శ్రీ వేంకటోత్తముఁడు నన్నుఁగూడె
యెప్పుడు మనసాక్కటే యిందుకేమి సేసెవే