పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0136-3 హిజ్జిజి సంపుటం; 07-213

పల్లవి:
ఏమని వొడఁబరచేవింకా నన్ను
ఆముక రెంటదెప్పరాలాయఁబో వలపులు

చ.1:
ఆరమణికి నీవు అంపిన సొమ్ములీడకుఁ
జేరెను తబ్బిబ్బుగాను చీట్లతోనే
పోరుకుఁ జాలకిందుకుఁ బుత్తెంచిన విడెమిదే
కూరాకువలెనాయ కోపపు నాచేతను

చ.2:
ఆయింతిని దాఁగివుండుమంటే నెరఁగక తానే
మాయింటికి వచ్చి చెప్పె మతకమెల్లా
మాయలకనుచరించ మరి నావద్షికి రాఁగా
యీయెడఁ బాయిటఁబడెనిదివో నీతరుణి

చ.3:
ఆపెను సన్న సేయఁగా నండనున్న నన్ను సోఁకె
యేపున నీ కొనగోరు యెచ్చరికగా
పై పై నన్నుఁగూడితివి బాపురె శ్రీ వేంకటేశ
చూపులఁ దనిసి యాకె చుట్టమాయ నీకును