పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0136-2 నాదరామక్రియ సంపుటం; 07-212

పల్లవి:
ఎరఁగవా వోయి నీవు యేల నన్నునడిగేవు
తరితారుకాణైవుండు తరితీపు వలపు

చ.1:
వచ్చీరాని పదము వంటిదివో వలపు
తచ్చన మాటలవంటి తమి వలపు
పచ్చని తీగెవలఁ బారేది వలపు
యిచ్చకపు చల్లగాలి యీడువచ్చు వలపు

చ.2:
వలరాయని గరిడి వంటిదివో వలపు
పిలిచి బిడ్డనిచ్చిన ప్రియమిది వలపు
చెలరేఁగే ముంజేతి చిలుకవో వలపు
నిలువు నూరువండేటి మొలకవో వలపు

చ.3:
వనములో వసంతమువంటిదివో వలపు
మనసులో నెలకొన్న మర్మమువో వలపు
యెనసితివి శ్రీ వేంకటేశ నీవు నన్నునిట్టె
కనుఁగొంటిమిద్దరికిఁ గాణాచి వలపు