పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0136-1 దేసాళం సంపుటం: 07-211

పల్లవి:
రట్టెతిమన్నిటాను దిట్టవు నీవు
గుట్టు తోడ నుండఁగాను కొసరకు నీవు

చ.1:
తగని నీచేఁతకు నేఁ దలవంచుకుండఁగాను
నగకుమీ సారె సారె నాతో నీవు
అగడై తొల్లే నేను ఆలనైవుండఁగాను
మొగము చూచి అప్పటి మొక్కకుమీ నీవు

చ.2:
అంతటా నేనీతో పాలయలుకతో నుండఁగాను
అంతలోఁ గొంగువట్టి తియ్యకుమీ నీవు
చెంతలనిట్టే నేను సిగ్గువడి వుండఁగాను
బంతినెడమాటాడి అంపకుమీ నీవు

చ.3:
పైకొని యేపొద్దు నేఁ బానుపుపైనుండఁగాను
వాకుచ్చి పేరునఁ బిలువకుమీ నీవు
చేకొని కూడితివిదె శ్రీ వెంకటేశ నన్ను
యీ కొలఁది మన్ననలే యిమ్మీ నీవు