పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0135-5 ఆహిరి సంపుటం: 07-209

పల్లవి:
సంతలోని జాణవు జాజరలో వాఁడవు
వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా

చ.1:
గొల్ల చల్ల పుల్లన గున్నచింత చల్లన
వొల్లనె షూ పొందులకు నోపుదువా
చల్లదుబ్బదుబ్బెడు సాదించితే వలపులు
తెల్లవారె మా గుట్టు తెలుసుకోవయ్యా

చ.2:
దోడ్డిగంపలప్పెఁడు తొలిపాలు చిప్పెఁడు
వొడ్డారపు మాతో పాందుకోపుదువా
జిడ్డుదేరి దుత్తెఁడు చిత్తములోని రతులు
తెడ్డెఁడేసి మోవితీపు తెలుసుకోవయ్యా

చ.3:
మందావులు కల్లలు మాకులెల్లా మొల్లలు
వొందిలి మాతోటే పొందుకోపుదువా "
కందువ శ్రీ వేంకటేశ కలసితివిదే నన్ను
దిందుపడే మా నవ్వులు తెలుసుకోవయ్యా