పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0104-2 శ్రీరాగం సంపుటం; 07-020

పల్లవి:
ఇచ్చకములాడరే యింతులాల
పచ్చి జవ్వన మింతలో పదను దీసీనా

చ.1:
ఏఁటికి విభుఁడు రాఁడొ యింటనట్టేవుండనీ
మాటలైనా నాడి రారె మగువలాల
తాఁట తూఁటలూనేల తావచ్చినట్టే వత్తము
పాటించిన నావలపు పండి పాల్లవొయ్యూనా

చ.2:
సౌగిసి యెంతపరాకో జూజాలట్టే ఆడీని
మొగమైనాఁ జూచి రారె ముదితలాల
యెగసక్కేలిఁకనేల యేకమౌదమీతనితో
నగఁగానే సరసాలు నాని విరిసీనా

చ.3:
కాయమెంత యలసెనో కడుదప్పిదేరనీ
చేయెత్తి మొక్కెయిన రారె చెలియలాల
యీయెడ శ్రీవేంకటేశుఁడేతెంచి తా నన్నుఁగూడె
కోయరాని కోరికలు కొలఁదినుండీనా