పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0135-4 వరాళి సంపుటం: 07-208

పల్లవి:
మేలే జాణవౌదువు మెస్తినే నిన్ను
మేలు వాని వలపుల మేడలోనే వున్నది

చ.1:
పలుకవే పతి తోను పదవే సకినలే
పలికీనతఁడు పండే పట్టె మంచాన
చిలుకవే నవ్వులు నెలవుల నదియేలే
బలిమిఁ జిలుక తనిపంజరాననున్నది

చ.2:
రూపుఁజూపవే నీవు రొచ్చులుగఁ జేరి తొల్లే
రూపులెల్లా నద్దములో రూడినున్నవి
తీపుల మోవియ్యవే తెలుసుకోవే నీవు
కోపులఁ దరి తీపులు కొంగుపైఁడైవున్నది

చ.3:
మొక్కవే ఆతనికి మోహము రెట్టించ నేఁడు
మొక్కఁబోయిన దేవర మొదలే తాను
యిక్కువ శ్రీ వేంకటేశుఁడిట్టే కలసెఁగదే
యెక్కువ కాఁగిటిలోన యిరవాయఁ గదవే