పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0135-3బౌొళి సంపుటం: 07-207

పల్లవి:
ఏల చెప్పేవు నీసుద్దులు యెందాఁకా మాతోను
పాలుమాలకింతలోనే బమ్మచారివైతివి

చ.1:
ఎలమి గొల్లెతలను యిన్నాళ్ళు పొంది పొంది
తొలఁగి మధురలోన దొరవైతివి
కొలఁది ఆవులఁగాచి గొల్లవాఁడవై యుండి
వలవంత నేఁడు రాచవాఁడవైతివి

చ.2:
వేడుకలకింటింట వెన్నదొంగిలి నేఁడు
ఆడ ద్వారకలో సోమయాజివైతివి
వోడక రుక్మిణీ దేవి నూరకే యెత్తుకవచ్చి
పాడితోనగ్రపూజకు పాత్రుఁడవైతివి

చ.3:
రక్కసుల కాఁపురాలు రచ్చలకెక్కఁ బెరిచి
పెక్కుధర్మాలు నిలిపి పెద్దవైతివి
చిక్కువాసి నన్నుఁగూడి శ్రీ వేంకటాద్రి మీఁద
దిక్కుల నిందరిపాలి దేవరవునైతివి