పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0135-2 ఖైరవి సంపుటం: 07-206

పల్లవి:
వద్దనేమా నేము వలసిన వనులకు
యద్దరునేకమై మాకు యేల లోఁగేవే

చ.1:
ముచ్చట నేమడిగితే మొఱఁగు మాటలాడేవు
బచ్చించి యాల నేరెడుఁబండులమ్మేవే
యిచ్చకానకాతనితో యిన్నినియ్యకొని వచ్చి
తచ్చనకు మాముందర తగవులాడేవే

చ.2:
మొగము నేము చూచితే మోసులువార నవ్వేవు
తగు వసంతపు నీట దైలు వోసేవే
అగపడి నీ విభుని కంకెలెల్లాఁ జెప్పి వచ్చి
పగటుతో మాముందర బయలీఁదించెవే

చ.3:
అందాలు నేమెరిఁగితే ఆయములు దాఁచేవు
గొందినే చెరువుకు మూకుడు మూసేవే
విందువలెనట్టె శ్రీ వేంకటేశుఁగూడి వచ్చి
చెంది మాముందరనేల సిగ్గులు వడేవే