పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0135-11 శ్రీరాగం సంపుటం; 07-205

పల్లవి:
ఎవ్వరు నేమి చెప్పిన యేఁటిమాట
వువ్విళ్ళూరఁ జిత్తగించుటొక్కటేమాట

చ.1:
చేయి చాఁచి మీఁద సిగ్గువడేయట్టుగాను
ఆయము సోఁకనాడినదదివో మాట
పాయపు వయసు నీది పచ్చివెచ్చిగాఁజేసి
యీయకోలు సేసినది యిదివోమాట

చ.2:
మంకుఁదనము దీరిచి మనసెల్లఁ జొక్కించి
అంకెకు రప్పించినది అదివోమాట
అంకెల సరివెనఁగి లాగులెల్లఁ జూపి నిన్ను
నింకాఁ గొసరుచున్నదిదివో మాట

చ.3:
చిప్పిలఁ గాఁగిటఁగూడి శ్రీ వెంకటేశ్వర నిన్ను
అప్పటినాస రేఁచినదదివో మాట
దప్పిదేరఁ గూడితిమి దాయక పాయక మన
మెప్పుడు నిట్లానుండేదిదివో మాట