పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0134-6 సౌరాష్ట్రం స సంపుటం: 07-204

పల్లవి:
తెలిసిన వారికిద్‌ తేనెకంటెఁ దీపులు
వలసితేఁ జేకొనవే వనితరో నీవు

చ.1:
నేరిచినవారికి నీడవంటిది మోహము
నేరనివారికి నెండ వెనెలవంటిది
కూరిమి గొసరితేను కొపము చెల్లదిందుకు
మేరమీరినఁ దమలో మెచ్చవలెఁ గాని

చ.2:
వోపనవారికి వయసోడబేరము వంటిది
వోపినివారికి వేఁటవుచ్చు. వంటిది
చేపట్టి తీసితేను సిగ్గులువడఁ దగదు
పై పైఁ గూడిన బాఁతిపడవలెఁ గాని

చ.3:
కూడినవారికి రతి కొట్టిన పిండివంటిది
కూడనివారికి కలగూరవంటిది
యీడుజోడై శ్రీ వేంకటేశుఁడిదె నిన్నుఁగూడీ
వేడుకతోఁ జెప్పినట్టు వినవలెఁగాని