పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0134-5 కన్నడగౌళ సంపుటం: 07-203

పల్లవి:
వెలఁది నిన్నీడకే విచ్చేయి మనె
బలిమి సేసినది యప్పటి యానవాలు

చ.1:
కొంగువట్టి నిన్నుఁదీసి కొనగోరు మేననూఁది
అంగన సన్నసేసినదానవాలు
వుంగరాలవెళ్ళ నీవొడిగట్టుకొని మోవి
యెంగిలిగాఁ జేసినది యిదియానవాలు

చ.2:
గుబ్బలురమున నూఁది కొల్లునను నవ్వు నవ్వి
అబ్బురము సేసినది ఆనవాలు
వుబ్బు నీకుఁ బొడమించి వొగి బొమ్మల జంకించి
నిబ్బరము చూపినది నీకు నానవాలు

చ.3:
కాయజకేలిని నిన్ను కన్నులనె మెచ్చిమెచ్చి
ఆయములు సోఁకించినదానవాలు
చాయల శ్రీ వేంకటేశ సతిఁ గూడితివి నీవు
యేయెడనెన్నటికి నిదే యానవాలు