పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0134-3 కాంబోది సంపుటం; 07-201

పల్లవి:
ఎగసక్కేలు నేర్చిన యింతులము
తగవెరిఁగిన మంచితనమే మేలును

చ.1:
పందేలకు నీవు నాతో పగడసాలాడఁగాను
మందెమేళాన నేమైనా మాటాడుదుము
అందుకుఁగా నీవప్పుడారడిఁ బెట్టఁగవద్దు
ముందు ముందె దొరతనముననుంటే మేలును

చ.2:
తెగడి నీతోఁ బిల్లదీపులాడఁ బిలిచేవు
జిగిమించనేమైనాఁ జేతుము నిన్ను
వెగటుగా నీవప్పుడు వేసాలు సేయవద్దు
వొగి గుట్టు తోడ నూరకుండుటే మేలును

చ.3:
వడి సరసాన నాతో వానగుంటలాడఁగాను
బెడిదమై చెయివట్టి పెనఁగుదుము
కడఁగి శ్రీ వేంకటేశ కలిసితివి మాటకే
విడువక మాతోడి వేడుకలే మేలును