పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0134-2 శంకరాభరణం సంపుటం: 07-200

పల్లవి:
ఆతఁడే యెరుఁగును అంకెలైన తగులు
చేతిలోనే వున్నదిది చెప్పరాని తగులు

చ.1:
మలసి చూచిన చూపు మనసులో తగులు
తలఁ లోపలి చింత తనువుకుఁ దగులు
వెలయుమేని సోఁకులు వేడుకకుఁ దగులు
అలరు వేడుకలే అన్నిటికిఁ దగులు

చ.2:
చిమ్ముచు నవ్విన నవ్వు సిగ్గులకుఁ దగులు
కుమ్మరించు సిగ్గులే తక్కుల తగులు
వుమ్మడి తక్కులెల్లా వొక్కటికిఁ దగులు
యిమ్ముల నొక్కటైతేనే యిరవాయఁ దగులు

చ.3:
మచ్చిక మాటలన్నియు మంతనాల తగులు
నిచ్చలు మంతనములు నిండురతి తగులు
చెచ్చెర నీ తగులు నా శ్రీ వేంకటేశుఁ గూడె
పచ్చి దోఁచిన కూటమి పంతముల తగులు