పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0104-1 దేసాళం సంపుటం: 07-019

పల్లవి:
అట్టె మీఁదనైనట్టులయ్యీఁ గాని
పట్టినదె పంతమై బలియగఁ జొచ్చును

చ.1:
మగవారిచేఁతలకు మానినులైనవారు
వెగట్లాడకుండరు వేయైనాను
అగపడి యెవ్వరైనా నారిచి తీరిచేమంటే
చిగురుఁ గొమ్మును చాఁగై చిమ్మిరేఁగఁజొచ్చును

చ.2:
వసమైనవారిమాట వలచి వచ్చినవారు
పిసరు మందెమేళాల పెంచకుండరు
అసమున నండవారు అందాలు సేసేమంటే
పిసికితే పసురై పిప్పిరేఁగఁజొచ్చును

చ.3:
సరసుల పొందులకు జాణలైన సతులెల్లా
ఒరసి సాదించకుండరొకమాటైనా
యిరవై శ్రీ వేంకటేశ యిదె నన్నుఁ గూడితివి
పెరరేఁగిన రతులు పెంటలుగాఁ జొచ్చును