పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0133-6 సౌరాష్ట్రం సంపుటం: 07-198

పల్లవి:
శ్రీ వేంకటేశ్వరునికి చెలి యలమేలుమంగ
వోవరిగా నెలకొని వురముపైనున్నది

చ.1:
పాంచి మచ్చ మైననాఁటి పాలసు కంపులు వాయ
సంచులఁ బన్నీట మజ్జన మార్చరే
అంచెఁ గూర్మ వరహములైనట్టి సాగటుదీర
మించఁ గప్పుర ధూళి మెత్తరే మేనను

చ.2:
నరసింహపు గదరు నాఁటి వామనపు జిడ్డు
పరశురామునిగబ్బు పచ్చివీడను
పరిమళముగట్టిన బంగారుగిన్నెఁ దెచ్చి
పారిఁ దిరుమేనఁ దట్టుపునుఁగిట్టె నించరే

చ.3:
గొల్లముంజురాచజడ్డు కోరి బుద్దుడైన సిగ్గు
చొల్లుగుఱపు నూఁగురొచ్చులు మానునా
ఇల్లిదె శ్రీ వెంకటేశుఁడీరూపై తానున్నవాఁడు
యెల్లపూదండలు సొమ్ములెక్కించరే